ETV Bharat / city

కాలనీల్లోనే సకల వసతులు: సీఎం జగన్ - స్పందన కార్యక్రమం వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

cm jagan
సీఎం జగన్
author img

By

Published : Jan 5, 2021, 3:34 PM IST

Updated : Jan 6, 2021, 6:26 AM IST

వైఎస్సార్‌ జగనన్న కాలనీల విస్తీర్ణం ఆధారంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉద్యానాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ తదితర సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘రహదారులు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు, కాలనీల స్వాగత తోరణాలను వినూత్న రీతిలో నిర్మించాలి. ప్రతి కాలనీ వెలుపల హైటెక్‌ రీతిలో బస్టాప్‌ ఉండాలి. భూగర్భ మురుగునీటి వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్‌ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు.

ఇళ్ల నిర్మాణంలో మన ముద్ర కన్పించాలి
‘ఇప్పటివరకు 39% ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. 17 వేలకుపైగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఉండగా 9,668 కాలనీల్లో పంపిణీ పూర్తైంది. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. అప్పటికల్లా ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారుల ఆప్షన్ల ఎంపిక పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు అందించాలి. అనర్హులెవరికీ అందకూడదు’ అని సీఎం స్పష్టం చేశారు. ‘కోర్టు కేసుల వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు భరోసా కల్పిస్తూ లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే స్థలాలు అందిస్తామని చెప్పాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కీలకం. ఇందులో అవినీతిని క్షమించం. కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి’ అని సీఎం పేర్కొన్నారు.

అంగన్‌వాడీలపై ప్రత్యేక శ్రద్ధ
‘గ్రామ సచివాలయాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌ పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలి. ఒక గుత్తేదారు లేదా ఏజెన్సీకి ఒక్క పనే అప్పగించాలి. ఫిబ్రవరి నెలాఖరుకు పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తిచేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి స్థలాలు వెంటనే సేకరించాలి. ఈ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్సుగా మార్చబోతున్నాం. చిన్నారులకు ఆరేళ్లలోపు 85% మెదడు అభివృద్ధి చెందుతుంది. అందుకే వారిపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. వారికి ఆంగ్లం సహా అన్నీ నేర్పిస్తాం’ అని అన్నారు.

ఏడాదంతా రోడ్ల మరమ్మతులు
‘రాష్ట్రంలో రూ.560 కోట్లతో చేపట్టనున్న రహదారుల మరమ్మతులకు ఈ నెల 10లోగా టెండర్లు పూర్తి చేయాలి. ఆ తర్వాత 45 రోజుల పాటు యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలి. రూ.2 వేల కోట్లతో ఈ ఏడాదంతా మరమ్మతులపై దృష్టి పెడుతున్నాం. రాష్ట్రంలో 31 జాతీయ ప్రాజెక్టుల కింద రూ.9,571 కోట్లతో 915 కి.మీ మేర రోడ్లు వేస్తున్నారు. రూ.12 వేల కోట్లతో కొత్త రహదారులు మంజూరయ్యాయి. వీటన్నింటికీ త్వరగా భూసేకరణ పూర్తి చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

సంవత్సరంలో గ్రామాలకు కొత్త రూపు
‘గ్రామం మధ్యలో 5 సెంట్ల స్థలంలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలి. ఆర్బీకేల ఏర్పాటుకు ఈ నెలాఖరుకల్లా భూములు గుర్తించాలి. వచ్చే ఏడాది కల్లా ప్రతి ఊళ్లో సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, ప్రాథమిక పాఠశాల, జనతా బజార్ల ఏర్పాటుతో గ్రామ స్వరూపం మారుతుంది. జనవరిలో పంట కోత ప్రయోగాలు పూర్తిచేసి ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నివేదిక ఇవ్వాలి. ఏప్రిల్‌ నాటికి రైతులకు పంటల బీమా అందేలా చూడాలి. జనవరి 11న అమ్మఒడి సాయం జమచేస్తాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అదేరోజు పాఠశాలల షెడ్యూల్‌ ప్రకటిస్తాం. వచ్చేనెల 1 నుంచి నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తాం. ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే వాహనాల్లో మూడు జిల్లాలకు సంబంధించి ఈ నెల 20న విజయవాడలో ప్రారంభిస్తాను. బియ్యం బస్తాలనూ అదేరోజు ఆవిష్కరిస్తా. మిగతా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు’ అని సీఎం వివరించారు.

ఇదీ చదవండి:

ముంపును నివారించేందుకు.. సాగర్​కు గేట్లు

Last Updated : Jan 6, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.