కూచిపూడి కళాకారిణి శోభానాయుడు మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం తెలిపారు. సత్యభామ, పద్మావతి పాత్రలకు ఆమె..తన నృత్యంతో ప్రాణం పోశారని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. వందల మంది కళాకారులను శోభానాయుడు తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు.
కూచిపూడి ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటారు : సీఎం
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు(64) అనారోగ్యంతో మృతి చెందారు. శోభానాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శోభానాయుడు కూచిపూడి ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటారని సీఎం కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి : కూచిపూడి నృత్యానికి నిలువెత్తు రూపం శోభానాయుడు..