ETV Bharat / city

schools reopen: రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం ఎప్పుడంటే..! - schools going to start in ap

schools reopen in ap
schools reopen in ap
author img

By

Published : Jul 23, 2021, 1:13 PM IST

Updated : Jul 23, 2021, 3:18 PM IST

13:11 July 23

ఏపీలో మోగనున్న బడిగంటలు

ఆదిమూలపు సురేశ్​, విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.  ఈ మేరకు సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత నాడు- నేడు పనులు ఆగస్టు 16 ప్రజలకు అంకితం చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ రోజే రెండో విడత నాడు- నేడు పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. విద్యాశాఖలో నాడు-నేడు, అంగన్‌వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  నూతన విద్యావిధానంపై ఆగష్టు 16నే సమగ్రంగా ప్రభుత్వం వివరించనుంది. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లనూ అదే రోజున అందజేయనుంది.

'ఆగస్టు16న పాఠశాలు పునః ప్రారంభించాలని సీఎం  జగన్ నిర్ణయించారు.  ఆగస్టు  16న ఎల్​కేజీ నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ పాఠశాలలు నడుపుతాం. ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఎల్​కేజీలో పిల్లలు అడ్మిషన్ల కు డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాల్లో చేరే విద్యార్థులకు టీసీ అవసరం లేదు.  ప్రైవేటు వారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.' - ఆదిమూలపు సురేశ్​, విద్యాశాఖ మంత్రి

ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్​కేజీ, యూకేజీ..!

            ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్​కేజీ, యూకేజీ  ప్రవేశ పెట్టాలని సీఎం జగన్​ నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. ఈ ఏడాది నుంచే   ఫౌండేషన్ స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి మండలంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించిన్టట్లు తెలిపారు. మూడేళ్లలో 16వేల 100 కోట్లతో  జూనియర్, డిగ్రీ కళాశాలలు ఆధునికీకరణ పనులకు చెపట్టాలని సీఎం చెప్పినట్లు వెల్లడించారు.  

'మొదటి విడత నాడు నేడు పనులను కూడా ఆగస్టు  16న  ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించాం. సుమారు రూ.4వేల కోట్లతో రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాం. నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే  రోజు  ప్రభుత్వం వివరిస్తుంది. విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడాఆగస్టు 16న  అందజేస్తాం. అంగన్ వాడీ టీచర్లకు ఎస్జీటీలుగా పదోన్నతి కల్పించడంపైనా చర్చించాం.'- ఆదిమూలపు సురేశ్​, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి:

RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated : Jul 23, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.