ఎన్నికల మేనిఫెస్టో.. జగన్ మాటల్లో చెప్పాలంటే.. అది వైకాపా ఖురాన్, బైబిల్, భగవద్గీత.! మరి 2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా.. ఆయన రాజధాని మీద ఏమన్నారో ఇప్పుడు చూద్దాం
2014 ఎన్నికల్లో వైకాపా ఓడింది. తెలుగుదేశం అధికారంలోకి... వచ్చింది. అప్పటికి రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. అసలు మీ మనసులో... ఏముందని జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు జగన్ ఇదిగో ఇలా చెప్పారు.
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండేలా చూడండి. కనీసం 30 వేల ఎకరాలుండేలా చూడండి. పుష్కలంగా నీరు అందుబాటులో ఉండేలా చూడండి. ఈ మూడు అంశాలు దృష్టిలో పెట్టుకుంటే.... పరిణామాలన్నీ మంచి ఆకృతి దాలుస్తాయి. నా సింపుల్ సలహా ఏంటంటే రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి.
జాతీయ మీడియా ప్రతినిధులతో: ఇక అమరావతి ప్రకటన రానే వచ్చింది. సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో రాజధానిపై అధికారిక ప్రకటన చేశారు. ఆ రోజు జగన్ ప్రసంగం వింటే ఇవాళ 3రాజధానులంటోంది ఆయనేనా? అని కరుడుగట్టిన వైకాపా అభిమానులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే.
అమరావతిపై అసెంబ్లీలో జగన్: ఇక విజయవాడ-గుంటూరు మధ్య జరిగిన వైకాపా ప్లీనరీలోనైతే.. అమరావతే అచ్చెరువొందే స్పీచ్ ఇచ్చారు జగన్.
ఇక ప్రజాసంకల్ప యాత్రలోనైతే అమరావతి పరిధిలోని జనాలు...ఈలవేసి గోలచేసేంతగా ప్రసంగాలు చేశారు జగన్.
ప్రజాసంకల్ప యాత్రలో: వైకాపా ముఖ్య నేతలేమైనా తక్కువా.? అధినేత మూడున్నర శృతిలో చెప్తే... ఆ పార్టీ నేతలు ఆరున్నర శృతిలో అమరావతి రాగాలు తీశారు. అసలు జగన్ ఇల్లే ఇక్కడుందంటూ డైలాగ్‌లు పేల్చారు.
ఇక వైకాపా ఖురాన్, బైబిల్, భగవద్గీత రచయిత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. అమరావతిపై అప్పుడు చెప్పిన మాటలు,... ఇప్పుడు ఆయనకూ ఆశ్చర్యం కలిగిస్తాయోమో.
ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి. అమరావతి ఎక్కడికీ వెళ్లదని అన్న మాటిచ్చాడు. ఆళ్ల చెప్తున్నాడంటూ.. సీన్ రక్తికట్టించారాయన.
ఇవీ చదవండి:
బాబాయ్, అబ్బాయ్ 'రానా నాయుడు'.. నెట్ఫ్లిక్స్లో యాక్షన్ థ్రిల్లర్