ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి జగన్ బుధవారం లేఖ రాశారు. ఏపీలో మొత్తం 132 వెబ్సైట్లు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణం అవుతున్నాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని ఏపీలో నిలిపివేసేలా ఇంటర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించాలని కోరారు. ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రికి లేఖ ద్వారా సీఎం తెలిపారు. 2020 సెప్టెంబర్ 25న ఈ సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్టు వివరించారు. ఈ చట్టం మేరకు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ నిర్వహించే వారు శిక్షార్హులని పేర్కొన్నారు.
ఈ వెబ్సైట్లు, యాప్‌లకు యువత బానిసలవుతున్నట్టు సీఎం లేఖలో పేర్కొన్నారు. చాలామంది తమ ఆస్తులను కూడా పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు అందరికి అందుబాటులో ఉన్నందున సులువుగా ఇలాంటి ఆన్లైన్ క్రీడలకు ఆకర్షితులై ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. ఏపీలో వీటి కార్యకలాపాలు నిరోధించేలా తక్షణం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇదీ చదవండి: