కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నాయకులు కోట వినయ్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్నవుటపల్లి మాజీ సర్పంచి కోట వినయ్, వైకాపా నాయకులపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారంటూ ఆత్కురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా కెడిసిసి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు పోలీస్ స్టేషన్ కు వచ్చి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. ఘటనను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే వంశీ అనుచరులు స్టేషన్ దగ్గరకి భారీగా చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతతో చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ రెండో విడత క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి