justice nv ramana : పద్మపురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగు ప్రముఖులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. డాక్టర్ వెంకట ఆదినారాయణరావు, దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావును, దివంగత షేక్ హసన్ సాహెబ్ తరఫున కుటుంబసభ్యులను సీజేఐ సత్కరించారు. పద్మశ్రీ అవార్టు గ్రహీతలతో సీజేఐ ముచ్చటించారు. అనంతరం కిన్నెర వాయిద్యంతో మొగులయ్య పాట పాడి వినిపించారు. తెలుగువారికి పద్మపురస్కారాలు రావడం పట్ల.. జస్టిస్ ఎన్వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.. 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు పురస్కారాలను స్వీకరించారు. భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్ హిలమ్ షా ఉద్దీన్ అందుకున్నారు.
ఇదీ చదవండి: Padma Awards 2022 : పద్మ పురస్కారాలు అందుకున్న గరికపాటి, వెంకట ఆదినారాయణరావు