రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కేసు దర్యాప్తును.. సీఐడీ వేగవంతం చేసింది. అసైన్డ్ భూముల అంశంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి.. ఆ పత్రాలను ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డికి ఇచ్చిన బిటెక్ విద్యార్థి జాన్సన్‌ను ప్రశ్నించింది. మంగళగిరి పరిధిలోని అసైన్డ్ భూములపై.. సమాచారహక్కు చట్టం కింద ఎప్పుడు?ఎందుకు? వివరాలు సేకరించారని విచారణలో అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి పత్రాలు ఎందుకిచ్చారన్నారు. అసైన్డ్ భూముల్లో ఎస్సీ రైతులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో జీవో 41 సమాచారాన్ని సేకరించానని.. అధికారులకు జాన్సన్ తెలిపినట్లు సమాచారం
ఇదీ చదవండి