రాష్ట్రంలో జలవనరుల శాఖ పని తీరు నానాటికీ దిగజారుతుందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవనాడీ పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చినరాజప్ప అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గత 18 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి కృషి చేయలేదన్నారు. మంత్రి అనిల్ కుమార్కు జలవనరుల శాఖపై అవగాహన లేదని ఆరోపించారు. ఆకాల వర్షాలు, తుపానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇదీ చదవండి