పౌరసరఫరాల శాఖ లో వినియోగదారుల వ్యవహారాల చూసేందుకు చీఫ్ విజిలెన్స్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ఢిల్లీ రావును చీఫ్ విజిలెన్స్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఢిల్లీ రావు పౌరసరఫరాల శాఖ లో వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించిన చీఫ్ విజిలెన్స్ అధికారిగా బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ