తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో ఎందరు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది చేరారనే సమాచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు అందజేశారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్లో సీఎంను మంగళవారం రాత్రి కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రైవేటు బస్సుల పర్మిట్లకు విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలనూ ఖరారు చేసినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: