ETV Bharat / city

విశాఖ సాయినార్​ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి - gas leak incidents news

విశాఖ సాయినార్​ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి

author img

By

Published : Jun 30, 2020, 5:52 AM IST

Updated : Jun 30, 2020, 10:04 AM IST

05:50 June 30

ఫార్మా కంపెనీలో రసాయన వాయువు లీక్​

విశాఖ ఫార్మా కంపెనీలో ప్రమాదం

విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్​ సైన్సెస్​​ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. హెచ్​డీఎస్​ రసాయన వాయువును రియాక్టర్​లోకి పంపుతుండగా రసాయన​ వాయువు లీక్​ అయ్యింది. ఈ ఘటనలో షిఫ్ట్​ ఇంఛార్జీ నరేంద్ర, కెమిస్ట్​ గౌరీశంకర్​ మృతి చెందారు. బాధితులు సూర్యనారాయణ, చంద్రశేఖర్​, జానకిరావు, ఆనంద్​బాబులు గాజువాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్​ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఆయన్ను కేజీహెచ్​కు తరలించారు. మృతులు నరేంద్రది గుంటూరు జిల్లా తెనాలి కాగా.. గౌరీశంకర్​ విజయనగరానికి చెందినవారు.

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్​ వినయ్​చంద్​, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.

ఎఫ్​ఐఆర్​ నమోదు

సాయినార్​ కంపెనీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. బాయిలర్​లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్​ లీకైనట్లు వివరించారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్‌ఛార్జి నరేంద్ర, కెమిస్ట్​ గౌరీ శంకర్​గా గుర్తించామని అన్నారు. బాధితులు సూర్యనారాయణ, చంద్రశేఖర్​, జానకిరావు, ఆనంద్​బాబులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి..

'థర్మల్ విద్యుత్ భారం భరించలేక పోతున్నాం... వెనక్కిచ్చేస్తాం'

Last Updated : Jun 30, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.