
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది.

చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవ ధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

శ్రమ అధికమవుతుంది. చేపట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవకుండా దూరదృష్టితో ఆలోచించాలి. గిట్టనివారికి దూరంగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

చేపట్టిన పనులను ప్రణాళికా ప్రకారం పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికవృద్ధి ఉంది. నారాయణ మంత్రాన్ని జపించాలి.

బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. మానసికంగా ధృడంగా ఉండాలి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శివారాధన శుభప్రదం.

దైవబలంతో పనులు పూర్తవుతాయి. చెడు పనులమీదకు మనసు మళ్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. తోటివారితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలున్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి.

చక్కటి వ్యూహాలతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.