ETV Bharat / city

హైదరాబాద్​కు చేరిన చరితారెడ్డి పార్థివదేహం - హైదరాబాద్​ చేరుకున్న చరితారెడ్డి పార్థివదేహం...

డిసెంబర్​ 27న మిచిగావ్​ ముస్కేగాన్​లో కారు ప్రమాదంలో బ్రెయిన్​డెడ్​ అయి... తన అవయవాలను తొమ్మిది మందికి దానం చేసిన చరితారెడ్డి పార్థివదేహం హైదరాబాద్​కు చేరుకుంది.

charitha-reddy-dead-body-reached-to-hyderabad
హైదరాబాద్​కు చేరిన చరితారెడ్డి పార్థివదేహం
author img

By

Published : Jan 5, 2020, 4:18 PM IST

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీవన్మృతురాలైన చరితారెడ్డి పార్థివదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. తెలంగాణలోని శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహాన్ని నేరేడ్​మెట్​ రేణుకానగర్​లోని నివాసానికి తరలించారు. డిసెంబరు 27న మిచిగావ్ ముస్కేగాన్‌లో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్​ కావటం వల్ల చరితారెడ్డి మృతి చెందింది.

చనిపోయినా బతికే ఉంది...!
చరితారెడ్డిని హైదరాబాద్​ తరలించేందుకు అయ్యే ఖర్చుల కోసం ఆమె స్నేహితులు చేయీ చేయీ కలిపారు. ఫేస్‌బుక్​లో ప్రత్యేక ఖాతాను తెరిచి క్రౌడ్‌ ఫండింగ్‌ చేశారు. కారు ప్రమాదంలో బ్రెయిన్​డెడ్​ కావటం వల్ల అవయవాలను కుటుంబసభ్యుల అంగీకారంతో తొమ్మిది మందికి దానం చేశారు. చరితారెడ్డి భౌతికంగా మృతిచెందినా తొమ్మిది మంది రూపంలో ఆమె బతికే ఉందంటున్నారు స్నేహితులు.

ఇవీ చూడండి: చనిపోయి కూడా తొమ్మిది మందికి జీవితాన్నిచ్చింది..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.