ETV Bharat / city

Chandrababu: మహిళలకు రియల్ టైం భద్రత కల్పించాలి: చంద్రబాబు - మహిళలపై దాడులు ప్రస్తావిస్తూ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu letter to DGP
డీజీపీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Jun 21, 2021, 5:16 PM IST

Updated : Jun 21, 2021, 6:13 PM IST

17:04 June 21

డీజీపీకి చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో సీతానగరం ఘాట్ వద్ద యువతిపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. దిశా చట్టం కింద ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, 24గంటల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్(DGP Gautam Sawang)​కు లేఖ రాశారు.  

నేరస్థులపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సంఘ వ్యతిరేక శక్తులు మహిళలపై మరింతగా దాడులకు తెగపడేలా చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ అన్నీ మోసపూరితంగా మారాయని ధ్వజమెత్తారు. వైకాపా రంగులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చినట్లుందని మండిపడ్డారు. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సీతానగరం పుష్కర​ఘాట్ వద్ద ఘటన అమానుషం

ముఖ్యమంత్రి నివాసానికి 2కిలోమీటర్లు, డీజీపీ కార్యాలయం, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి 3కిలోమీటర్ల దూరంలో సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతిపై జరిగిన అత్యాచార దుర్ఘటన అమానుషమని చంద్రబాబు(Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్​ల వల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలు గడిచినా ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమన్న చంద్రబాబు...ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. 

డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఫిర్యాదులు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమని ఆక్షేపించారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నేరస్థుల్ని త్వరగా పట్టుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: MP Raghurama: మండలి రద్దు కోసం నేనూ పోరాడుతా.. సీఎంకు ఎంపీ రఘురామ లేఖ

Last Updated : Jun 21, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.