వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాడి ప్రజలను చైతన్యపరిచారన్న చంద్రబాబు... పూలే స్ఫూర్తితో తెదేపా బీసీల అభ్యున్నతికి పాటుపడుతోందని వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు మూలం సమాజంలో సగభాగమైన మహిళలు విద్యకు దూరమవడమే కారణమని భావించి, స్త్రీలకు ప్రత్యేకంగా పూలే పాఠశాలలు ప్రారంభించారని కొనియాడారు. జ్యోతిరావు పూలే సామాజిక, దేశ సేవలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!