ETV Bharat / city

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నాయకుల తీరు: చంద్రబాబు

author img

By

Published : Feb 7, 2021, 10:29 PM IST

Updated : Feb 8, 2021, 2:33 AM IST

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల తీరు దిగజారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నాయకుల తీరు

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల, పుంగనూరు మండల, గ్రామ తెదేపా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

మాచర్లలో సీఐ భక్తవత్సల రెడ్డి, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐలు ధరణీధర్, లక్ష్మీకాంతంలు వేధిస్తున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి.. పార్టీ నేతలు తీసుకొచ్చారు. సీఎం జగన్ ప్రోద్భలంతోనే మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తూ.... హింస రాజకీయాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు.

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. నామినేషన్లు తీసుకోకుండా అడ్డుపడితే ఈమెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల కమిషన్​కు, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే అవకాశం కూడా లేకుండా భయానక వాతావరణాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించారన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

మంత్రిగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా నేడు అధికార దుర్వినియోగంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చిన అభ్యర్థులను వేధిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేస్తే ఎర్రచందనం కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం అక్రమాలకు పరాకాష్ట అన్నారు. పెద్దిరెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు, ఈసీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ నిఘా ఉంచాలి: వర్ల రామయ్య

Last Updated : Feb 8, 2021, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.