సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్‌కు ఏమాత్రం శ్రద్ధ లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. తెదేపాను అణగదొక్కడంపైనే వైకాపా దృష్టి పెట్టిందని ఆరోపించారు. పేదల గొంతు వినిపించడమే తెదేపా చేసిన నేరమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉల్లి ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడం తప్పా..? అని నిలదీశారు.
ప్రజలను వైకాపా నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉల్లిపాయలు ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. ఉల్లి డోర్ డెలివరీ చేయకపోతే వాలంటీర్లకు జీతాలు దండగన్న చంద్రబాబు... విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి ముగ్గురు రైతులు మృతిచెందారని గుర్తుచేశారు.
నిన్న ఉల్లి కోసం క్యూ లైన్‌లో ఒకరు చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్న చంద్రబాబు... రాష్ట్రంలో అన్నదాతలకు రూ.వేలకోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...