ETV Bharat / city

'జగన్ పేపర్ లీక్ చేశారు... జీఎన్ రావు పరీక్ష రాశారు' - తుళ్లూరు మహాధర్నాలో చంద్రబాబు

రాజధానులపై ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే... జీఎన్ రావు నివేదిక అనే పరీక్ష రాశారని తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తుళ్లూరు రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు..  వైకాపా రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమరావతిని ఎడారి, శ్మశానంతో పోల్చడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. రాజధాని కోసం 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూముల ఇస్తే వారిని రోడ్డున పడేశారన్నారు.

chandrababu naidu
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Dec 23, 2019, 5:35 PM IST

Updated : Dec 23, 2019, 6:15 PM IST

తుళ్లూరు మహాధర్నాలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతుల నిర్వహిస్తున్న మహాధర్మాకు తెదేపా అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు తుళ్లూరులో చేస్తున్న నిరసనలో చంద్రబాబు, తెదేపా నేతలు పాల్గొన్నారు. అనంతరం వెలగపూడి రైతుల రిలే నిరాహార దీక్షలోనూ చంద్రబాబు పాల్గొన్నారు.

రైతులను రోడ్డున పడేస్తారా..?
మహాధర్నాలో రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్డు మీదకు వచ్చారని చంద్రబాబు ఆవేదన చెందారు. 29 గ్రామాల రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో ల్యాండ్​పూలింగ్‌కు పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో రైతులు ప్రథమ పౌరులుగా ఉండాలని తాము ఆలోచిస్తే.... వైకాపా ప్రభుత్వంలో వాళ్లు భార్యాపిల్లలతో రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధిని కొనసాగించాలని చంద్రబాబు అన్నారు.

పైసా ఖర్చు పెట్టకుండా రాజధాని నిర్మాణం
రాజధాని నిర్మాణానికి డబ్బులేదని చెబుతున్నారని.. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ ఉండే ఆస్తులపై వచ్చే ఆదాయంతో పూర్తి చేయవచ్చని చంద్రబాబు అన్నారు. నిర్మాణాలు కొనసాగితే జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో బాండ్లు కడితే గంటలో రూ.2వేల కోట్లు వచ్చాయని... అదీ అమరావతి శక్తి అన్నారు. హ్యాపీనెస్ట్‌తోనూ ఆదాయం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 2014, సెప్టెంబర్‌ 4న అసెంబ్లీలో చర్చ జరిగినపుడు జగన్‌ విజయవాడలో రాజధానిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారని.. రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలని సూచించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి ఎందుకు మాట తప్పారని నిలదీశారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్​పై న్యాయ విచారణకు సిద్ధమా..?
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలని.. దానికి తామూ సహకరిస్తామన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో అమరావతిని విస్మరించడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతిని ఎడారి అని.. శ్మశానమని.. మునిగిపోతుందని వైకాపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చెన్నై, హైదరాబాద్‌ కంటే అమరావతి నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందని ఐఐటీ చెన్నై నివేదిక ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.

అది జగన్ నివేదిక
సీఎం జగన్ పేపర్ లీక్ చేస్తే... జీఎన్ రావు పరీక్ష రాశారని చంద్రబాబు ఆరోపించారు. జీఎన్‌ రావు కమిటీకి విశ్వసనీయత ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు ముందే జగన్ లీకు చేశారని ఆయన చెప్పారు. నివేదిక జీఎన్‌ రావు కమిటీ ఇచ్చింది కాదని... జగన్‌మోహన్‌ నివేదిక అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

దేశంలో ఎక్కడైనా ఇన్ని రాజధానులు ఉన్నాయా..?
మూడు రాజధానులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు, సీఎం, గవర్నర్‌ నివాసాలు వేర్వేరుచోట్ల ఉన్నాయా అని నిలదీశారు. రాజకీయంగా విభేదించండి కానీ.. ప్రజానీకాన్ని శిక్షించడం భావ్యం కాదన్నారు. వైకాపా చర్యలు ప్రాంతాలు, సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పామన్న చంద్రబాబు... ఉత్తరాంధ్ర, రాయలసీమకు సమాన దూరమనే అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు.

వెలగపూడిలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఒకే కులం... రైతు కులం
తుళ్లూరు మహాధర్నా అనంతరం వెలగపూడి రైతు రిలే నిరాహార దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు.

'మీరంతా ఒకే కులం.. అది రైతు కులం. మీరంతా ఒకే పార్టీ.. అది అమరావతి పార్టీ. ఓ మంత్రి అమరావతి శ్మశానం అంటున్నారు. శ్మశానంలో కూర్చుని మంత్రి పాలిస్తున్నారా?. మరొకరు ఎడారి అంటున్నారు. ఎడారిలో పాలన ఎలా చేస్తున్నారు. విశాఖను ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌, ఐటీ హబ్‌గా మార్చేందుకు కృషి చేశాం. తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు '

.. చంద్రబాబు, తెదేపా అధినేత

వెలగపూడిలో ఆరవరోజు రిలే నిరాహార దీక్ష చేస్తోన్న రైతులకు.. చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఇదీ చదవండి :

"రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి"

Last Updated : Dec 23, 2019, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.