ETV Bharat / city

ఎన్నికలకు ఎంతో సమయం లేదు, దూకుడు పెంచాలన్న చంద్రబాబు

Chandrababu నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేత చర్యలపై నేతలకు చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. నివేదికల ఆధారంగా ఇంచార్జ్‌లతో మాట్లాడి సూచనలు చేశారు. రానున్న ఏడాది కాలమే అత్యంత కీలకమని, అలసత్వం వీడి ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Aug 18, 2022, 8:29 AM IST

Chandrababu ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదని... పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు మరింత దూకుడుగా పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. రానున్న ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని, నేతలంతా అలసత్వం వీడి, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు. శాసనసభ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులతో ఆయన బుధవారం నుంచి సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. తొలిరోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు మండలి బుద్ధప్రసాద్‌, బోడే ప్రసాద్‌, కందుల నారాయణరెడ్డి, విజయకుమార్‌లతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితాల పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకుల పనితీరు వంటి అంశాలపై వారితో చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తనవద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇన్‌ఛార్జులకు పలు సూచనలు చేశారు. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనడంతో పాటు, స్థానిక సమస్యలపైనా పోరాడాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం గడచిన మూడేళ్లలో ఏ నియోజకవర్గంలో ఒక్క పనీ చేయలేదని, ప్రజల సమస్యల్ని పూర్తిగా గాలికొదిలేసిందని, ఈ అంశాలపై నిరసనలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపైనా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని వారికి చంద్రబాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.