రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు(CHANDRABABU RESPONDS ON AP FLOODS) పిలుపునిచ్చారు. సహాయచర్యలకు సమన్వయకర్తలుగా తెదేపా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లను సమన్వయకర్తలుగా నియమించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.
ఇదీ చూడండి: RAHUL GANDHI TWEET : 'వరద బాధితులకు కార్యకర్తలంతా అండగా ఉండాలి'