అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... జిల్లాల వారీగా కరోనా వ్యాప్తి నివారణ చర్యలను తెలుసుకున్నారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు.
దిల్లీలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న తెలుగు విద్యార్థులను తిరిగి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలను వైకాపా నేతలకు సడలించడం తగదన్న ఆయన... విజయసాయిరెడ్డి 200 మందితో తిరిగారని... అదే నలుగురితో పెడన వెళ్తున్న కొల్లు రవీంద్రను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
ఏ జిల్లా ఆసుపత్రిలోనూ వైద్యులకు సరిపడా పీపీఈ కిట్లు లేవని మండిపడ్డారు. ఈ విపత్కర సమయంలో ప్రజల కష్టనష్టాలను పంచుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉపాధి లేని పేద కుటుంబాలను ఆదుకోవటంతో పాటు నిత్యావసరాలు తీర్చాలన్నారు.
ఇదీ చదవండి: