సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చంద్రబాబు తెలిపారు. భావితరాల కోసం పోరాడతామని... అమరావతిని నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు ఒప్పుకోమని తేల్చిచెప్పారు. అరెస్టులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. విభజన బిల్లు తీసుకొచ్చినప్పుడూ ఇంత బందోబస్తు పెట్టలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి..
హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం.. తుళ్లూరులో ఉద్రిక్తత