ETV Bharat / city

TDP: 'ప్రజల నిరసనలు చూసైనా పెట్రో ధరలు తగ్గించండి'

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, భవిష్యత్తు కార్యాచరణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజల నిరసన చూసైనా పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రలు అదుపులో లేకుండాపోయాయని దుయ్యబట్టారు.

chandrababu meeting with party key leaders

author img

By

Published : Aug 30, 2021, 4:50 PM IST

ప్రజల నిరసన చూసైనా పెట్రో ధరలు తగ్గించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్​పై భవిష్యత్​లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని నాయకులు ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల్లో స్కామ్​లకు అడ్డుకట్ట వేసినా, దుబారా నివారించినా పెట్రోల్, డీజిల్​పై ధరలు పెంచాల్సిన అవసరం రాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. నిత్యం నేరాలు, అత్యాచార ఘటనలతో పత్రికలన్నీ నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని నేతలు మండిపడ్డారు. ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయని.. ప్రశాంతమైన విశాఖను అశాంతి నిలయంగా మార్చారని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు. ఇసుక అక్రమ మైనింగ్​లో ముఖ్యమంత్రి కార్యాలయం, కొందరు మంత్రులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే ఉచిత ఇసుక విధానం తిరిగి తేవాలని డిమాండ్‌ చేశారు. మహిళల పొదుపును కూడా తాకట్టు పెట్టి జగన్​రెడ్డి అప్పులు తెచ్చే విధానాలకు తెరతీయబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్​లో ఇది డ్వాక్రా మహిళలకు భారంగా మారి వారే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని దుయ్యబట్టారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని మండిపడ్డారు. అమరావతి విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను నేతలు ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

గూగుల్ చరిత్ర మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.