ETV Bharat / city

పాలకొల్లు ఘటనపై విచారణ జరపండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ - ఆంధ్రప్రదేశ్ వార్తలు

CBN LETTER TO DGP: ఏలూరు జిల్లాలో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడిని అధినేత చంద్రబాబు ఖండించారు. మ్మెల్యే, ఎమ్మెల్సీలను వేదికపైకి వెళ్లనీయకుండా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ, ఐదుగురు ఎస్సెలు సహా ఏ ఒక్క పోలీసూ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులపై, అడ్డుకోకుండా అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి లేఖ రాశారు.

CBN LETTER TO DGP
CBN LETTER TO DGP
author img

By

Published : Aug 7, 2022, 11:43 AM IST

CBN LETTER TO DGP: ఏలూరు జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లను వైకాపా శ్రేణులు అడ్డుకోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వేదికపైకి వెళ్లనీయకుండా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ, ఐదుగురు ఎస్సెలు సహా ఏ ఒక్క పోలీసూ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు శనివారం లేఖ రాశారు. ‘పాలకొల్లులోని పెంకులపాడులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో వైకాపా గూండాలు అమానుషంగా వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యే అని చూడకుండా రామానాయుడిపై దాడిచేశారు. వేదిక పైనుంచి ఆయన్ను కిందికి తోసేయడంతో గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే ప్రజాప్రతినిధులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటి? దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులపై, అడ్డుకోకుండా అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై సమగ్ర విచారణ జరపాలి. పోలీసులు సమర్థంగా, నిజాయతీగా పని చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను లేఖకు జత చేశారు.

తెదేపా సామాజిక మాధ్యమ ఖాతాల డీపీగా జాతీయ పతాకం: తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సామాజిక మాధ్యమ ఖాతాల డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచినట్లు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.