ETV Bharat / city

అవసరమైతే..పల్నాడుకు వెళ్లి ఉంటా: చంద్రబాబు

తెలుగుదేశం నేతలపై దాడులు, నేరాలను ప్రోత్సహించవద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో పల్నాడు ప్రాంత కార్యకర్తలు, నేతలు చంద్రబాబును కలసి తమపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Aug 27, 2019, 8:39 PM IST

chandrababu_fires_on_jagan
అవసరమైతే..పల్నాడుకు వెళ్లి ఉంటా:చంద్రబాబు

తెదేపా నేతలపై చేస్తున్న దాడులకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులతో ఏమైనా చేయవచ్చని సీఎం భావిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు పరిరక్షించలేని స్థితికి పోలీసులు వస్తే... రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు. అవసరమైతే తానే పల్నాడు ప్రాంతానికి వెళ్లి ఉంటానన్న చంద్రబాబు.. పేదల ఉసురు తగిలే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్​కు సూచించారు. గురజాల, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని ఆక్షేపించారు. కట్టడి చేయాల్సిన పోలీసులే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి వత్తాసు పలకటానికా పోలీసులు ఉన్నది అని ప్రశ్నించారు. జగన్ తన దుర్మార్గమైన పాలనను ఇప్పటికైనా సరిచేసుకోవాలని హితవు పలికారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తెలుగుదేశం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉద్యమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.