ETV Bharat / city

పేదల ఇళ్ల నిర్మాణానికి కనీసం 2 సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు - Chandrababu fires on Jagan Over House sites news

తెదేపా అధికారంలోకి వస్తే అన్ని కేటాగిరిల్లో ఇళ్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టో పెట్టామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఆ పథకాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. వైకాపాకు కష్టకాలం మొదలైందని, ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది తెదేపానే అనే విషయం సభాపతి గుర్తించాలని హితవుపలికారు.

Chandrababu fires on Jagan Over House sites
చంద్రబాబు
author img

By

Published : Dec 1, 2020, 6:54 PM IST

Updated : Dec 2, 2020, 12:27 AM IST

పేదల ఇళ్ల నిర్మాణానికి కనీసం 2 సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు

అసెంబ్లీలో తెదేపా సభ్యుల సస్పెన్షన్ అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం వరకు తెదేపా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి నిరసన ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...అన్ని కేటాగిరిల్లోని టిడ్కో ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు కట్టి, ఎప్పుడు ఇళ్లు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టంచేయాలన్నారు. ప్రతిపక్షనేతగా ఎన్నికల ప్రచారంలో అన్ని కేటాగిరిల ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న జగన్ ఆ మాటలకు కట్టుబడి ఉండాలన్నారు. సమాధానం చెప్పే సత్తా లేక అసహనంతో సొంత డబ్బులు ఇస్తున్నట్లు గాలి మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు చెప్పే పరిస్థితిలో లేని సీఎం ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఏడాదిన్నరగా వైకాపా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న చంద్రబాబు...లాటరీ పద్ధతిలో తాము కేటాయించిన ఇళ్లను రద్దుచేసి సొంత వారికి కట్టబెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నా ఇళ్లు నా సొంతం కార్యక్రమంతో భయపడి ప్రభుత్వం డిసెంబరులో ఇళ్లు ఇస్తామని ప్రకటించిందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి 10 లక్షల రూపాయల ఆస్తి అందించేందుకు తెదేపా శ్రీకారం చూడితే వైకాపా వాటిని మురికి కూపాలకుగా మార్చారని మండిపడ్డారు.

ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం

ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఎమ్మెల్యేలు లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తూ ఆంధ్రప్రదేశ్​ని గ్యాంబిలింగ్ కేంద్రంగా మారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారని నిలదీశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో 4 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నరేగా నిధుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తే ఆధారాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై కడుపు కాలిన వాళ్లు కోర్టుకు వెళితే తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ జీవితం ఇచ్చింది తెదేపానే

సభలో 50 మంది వరకు వైకాపా సభ్యులు తన ప్రసంగానికి అడ్డు తగిలి ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, ప్రజల కోసమే అన్ని అవమానాలను ఒపిగ్గా భరించానని చంద్రబాబు తెలిపారు. హుందా తనం లేకుండా వీధి రౌడీల్లా నీచంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. సభాపతి కూడా తనపై కాగితాలు విసిరారన్న చంద్రబాబు...ఆయనకి రాజకీయ జీవితం ఇచ్చింది తెదేపానే అని గుర్తుచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సముచిత స్థానం కల్పించామని వెల్లడించారు.

నేతల ర్యాలీ

నిర్మాణం పూర్తయిన ఇళ్లను తక్షణమే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కాలినడకన వెళ్లారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే అంశంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఇళ్లను చేపట్టామన్న పార్టీ నేతలు...వాటిల్లో 90 శాతం మేర టిడ్కో ఇళ్లు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా పేదలకు వాటిని స్వాధీనం చేయకుండా ప్రతినెలా అద్దె భారం మోపారని దుయ్యబట్టారు. తెదేపా పిలుపునిచ్చిన నా ఇల్లు నా సొంతం కార్యక్రమంతోనే ప్రభుత్వంలో స్పందన వచ్చిందన్నారు. పేదల ఇళ్లకు సంబంధించి పాత బకాయిలన్నీ చెల్లించి లబ్దిదారులకు వెంటనే వాటిని అందచేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇళ్లన్నీ ఉచితమేనన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండీ... 350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Last Updated : Dec 2, 2020, 12:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.