ETV Bharat / city

'వికేంద్రీకరణపై జగన్ చేసేదంతా తప్పుడు ప్రచారం' - chandrababu latest tweets

సీఎం జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కరోనాను వ్యాప్తి చేయటమే జగన్ ఇప్పటివరకు వికేంద్రీకరించిన ఏకైక అంశమని దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణపై జగన్ చేసేదంతా తప్పుడు ప్రచారమన్న చంద్రబాబు... రాష్ట్రం కరోనా కేసుల్లో మాత్రం అగ్రగామిగా ఉందని విమర్శించారు.

chandrababu fires on jagan over corona spread
చంద్రబాబు
author img

By

Published : Aug 22, 2020, 3:04 AM IST

కరోనాను వ్యాప్తి చేయటమే జగన్ ఇప్పటివరకు వికేంద్రీకరించిన ఏకైక అంశమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాలను అబద్ధాల తెర వెనుక దాచడం ఇకనైనా మాని.. కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నివారాణకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ.. ఆ తరువాత రాజకీయాలకు సమయం కేటాయిస్తే మంచిదని హితవు పలికారు.

chandrababu fires on jagan over corona spread
చంద్రబాబు ట్వీట్

నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం హయాంలో జరిగింది అనేది వాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ఇప్పుడు జగన్ చేసేదంతా తప్పుడు ప్రచారమన్న చంద్రబాబు... రాష్ట్రం కరోనా కేసుల్లో మాత్రం అగ్రగామిగా ఉందని దుయ్యబట్టారు. ఏపీలో నగరాల పరిశుభ్రత ర్యాంకింగ్స్‌లో పడిపోయాయని విమర్శించారు. 2018తో పోల్చితే తాజా ర్యాంకింగ్​లో పడిపోయాయని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.