ETV Bharat / city

13.30 లక్షల డోస్​లు ఏ మూలకు సరిపోతాయి?: చంద్రబాబు

కరోనా సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై.. మంత్రివర్గంలో కనీస ప్రాధాన్యత కల్పించలేదన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, పడకల కొరత లేదని అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. కొత్త స్ట్రెయిన్ ఎన్440కె పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేదని దుయ్యబట్టారు. కరోనా బాధితులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

chandrababu
chandrababu
author img

By

Published : May 5, 2021, 4:51 PM IST

Updated : May 6, 2021, 3:37 AM IST

రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వేయాలని, రాష్ట్రమంతా తక్షణం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేరళ, కర్ణాటక కోటి చొప్పున, తమిళనాడు 1.5 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం ఆర్డర్‌ పెడితే, ఏపీ ప్రభుత్వం కేవలం 13.30 లక్షల డోస్‌లకే ఆర్డర్‌ చేసి, కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి.. అందరికీ వ్యాక్సిన్‌ వేసేస్తామన్నట్టు మాట్లాడటమేంటని ఆయన ధ్వజమెత్తారు. ప్రపంచంలో ప్రజలందరికీ రెండు డోస్‌ల వ్యాక్సిన్‌లు వేసిన దేశాలన్నీ కరోనాను సమర్థంగా నియంత్రించాయని ఆయన తెలిపారు. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చయినా సరే.. ప్రభుత్వం మన రాష్ట్రంలోనూ 18 ఏళ్లు దాటిన వారిందరికీ వ్యాక్సిన్‌ వేయడమే తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలన్నారు.

చంద్రబాబు

కొరతే లేదని ప్రభుత్వం చెబుతోంది

కరోనా ప్రభావం, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. కరోనా సెకండ్‌వేవ్‌ బీభత్సం సృష్టిస్తూ, కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకు పోతుంటే ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నెల 4వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశం అజెండాలో కొవిడ్‌ నియంత్రణను 33వ అంశంగా పెట్టుకోవడమే దానికి నిదర్శనమన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కె కర్నూలులో బయటపడి దేశమంతా వ్యాపిస్తోందని, ఇది వరకు వ్యాపించిన స్ట్రెయిన్‌ల కన్నా అది 10-15 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు, జాతీయ మీడియా చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త స్ట్రెయినేలేదని, రాష్ట్రంలో పడకలకు, వెంటిలేటర్లకు కొరతే లేదని బుకాయిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఈ క్లిష్ట సమయంలో ఎంతో బాధ, ఆవేదన, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నదే తమ అభిమతమని తెలిపారు.

నియంత్రణ చర్యలు చేపట్టాలి

వ్యాక్సిన్‌పై ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోందని చంద్రబాబు నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసులు ఎక్కువున్నా.. ప్రభుత్వం తగినన్ని పరీక్షలు చేయడం లేదన్న చంద్రబాబు.. అనంతపురం జిల్లా కలెక్టరే ఆ విషయం చెప్పారని గుర్తు చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ఎన్ని పడకలు, ఎన్ని వెంటిలేటర్లు, ఎంత ఆక్సిజన్, ఏ మేరకు మందులు అందుబాటులో ఉన్నాయో డ్యాష్‌బోర్డులో ఎందుకు పెట్టడంలేదన్నారు. మందులు, పరికరాల కొనుగోలుకి మే 3న అత్యవసర సమావేశం పెట్టుకోవడమేంటని నిలదీశారు.

బ్రాందీ షాలుపు తెరవడమెందుకు?

కర్ఫ్యూ మినహాయింపుని అత్యవసరాలకు పరిమితం చేయకుండా బ్రాందీషాపులూ తెరవాల్సిన అవసరమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కొన్ని రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలన్నారు. ప్రస్తుతం కరోనా సోకినవారిలో అవసరం లేనివారికీ ఆస్పత్రుల్లో బెడ్‌లు కేటాయించడం వల్ల అవసరమున్నవారికి దొరకడటం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలున్నవారిని మొదట్లోనే గుర్తించి ఇంటి దగరే చికిత్స చేస్తే, ఆ పరిస్థితి నివారించొచ్చని స్పష్టం చేశారు. కరోనాతో చనిపోయినవారందరికీ బీమా సౌకర్యం కల్పించటంతో పాటు అంత్యక్రియల ఖర్చులకు ప్రభుత్వం డబ్బులివ్వాలన్నారు. కరోనాతో ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, నిర్మాణ రంగ కార్మికులు, కూలి పని లేని పేదలు ఇబ్బంది పడుతున్నారన్న చంద్రబాబు.. కరోనా వచ్చి తగ్గిన వారిలో కొందరికి సరియైన తిండి తినడానికీ డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారందర్నీ ప్రభుత్వం ఆదుకోవటంతో పాటు నిత్యావసర సరకుల ధరలు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

హోప్.. హెల్ప్ కార్యక్రమం

హోం క్వారంటైన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు.. ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు ఇచ్చేందుకు, మందులు సరఫరా చేసేందుకు ‘హోప్‌.. హెల్ప్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. తెదేపా కార్యాలయంలో కరోనా సోకినవారితో పాటు మరికొందరికి కలిపి ఇప్పటి వరకు 195 మందికి ఒక ప్రయోగంగా దీన్ని అమలు చేశామన్నారు. అమెరికా నుంచి వైద్య నిపుణులు డాక్టర్‌ లోకేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. 195 మందిలో 45 మందికి పూర్తిగా వ్యాధి నయమైందని, మరో 150 మంది కోలుకుంటున్నారని తెలిపారు. 9 మందికి ఆక్సిజన్‌ అవసరమైతే ఇంటికి పంపించామని, ముగ్గుర్ని ఆస్పత్రికి పంపామన్నారు.

ఒక్కొక్కరికి మందులకు, ఇతర సదుపాయాలకు 4 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని చంద్రబాబు అన్నారు. కరోనా సోకినవారిలో ఏదైనా సహాయం కావలసినవారి కోసం ట్విటర్‌ ఖాతా ఏర్పాటు చేస్తే.. 262 విజ్ఞప్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వాటిలో 95 పరిష్కరించామన్నారు. పార్టీ తరఫున కరోనా రోగులకు సేవా కార్యక్రమాన్ని, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి వైద్య సలహాలు, మందులు అందజేసే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నామని, పార్టీ సర్వసభ్య సమావేశంలో దీన్ని ఖరారు చేస్తామని తెలిపారు. ఈ కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు స్థోమతు ఉన్నవాళ్లు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలనీ చంద్రబాబు కోరారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూత్రాలపై పార్టీ పరంగా రూపొందించిన వీడియోతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ను చంద్రబాబు విడుదల చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ: అమల్లోకి కఠిన ఆంక్షలు

Last Updated : May 6, 2021, 3:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.