ETV Bharat / city

విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..? - chandrababu on ycp governament

రెండు తెలుగు రాష్ట్రాలో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు తొలి రోజు మాట్లాడిన ఆయన..కార్యకర్తల కృషిని కొనియాడారు. ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu
chandrababu
author img

By

Published : May 27, 2020, 2:41 PM IST

Updated : May 28, 2020, 6:40 AM IST

ప్రాజెక్టులపై మాట్లాడుతున్న చంద్రబాబు

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతోందని, వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏడాదిలో రూ.80 వేల కోట్ల అప్పులు చేసిందని.. అదీ చాలక ప్రజలపై రూ.50 వేల కోట్ల పన్నుల భారం వేసిందని మండిపడ్డారు. ఆస్తులు అమ్మినా కూడా అభివృద్ధి శూన్యమేనని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఏమైంది? తెలంగాణతోనూ, కేంద్రంతోనూ ఉన్న సమస్యలు ఎన్ని పరిష్కరించారని ఆయన నిలదీశారు. ‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఎలా మనుగడ సాగిస్తుందో తెలియని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేసి, తెదేపాపై నెపం వేస్తోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం తెదేపా మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండటం.. కార్మిక, కర్షక వర్గాల సంక్షేమం వంటి పార్టీ మూల సిద్ధాంతాల్ని ఎవరూ విస్మరించరాదని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మర్చిపోవాలని, భవిష్యత్తులో అలా జరగకుండా వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం కోసం, పార్టీ కోసం మళ్లీ కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.

‘దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోని వెనుకబడినవర్గాలకు.. తెదేపా ఆవిర్భావం ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు తెచ్చింది. 38 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నది బీసీలే. మనం తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేసినా.. వారిలో ఏమైనా అపోహలున్నా సరిదిద్దుకోవాలి. బీసీల్లో తిరిగి ఆ నమ్మకాన్ని తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేయాలి. దానికి ఈ మహానాడే నాంది పలకాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ‘ఎన్ని కష్టనష్టాలున్నా.. ప్రజలకు అండగా నిలుద్దాం. కార్యకర్తల త్యాగాలు వృథా పోనివ్వకూడదు. ఎన్నికల తర్వాత మూడు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో పర్యటించాను. కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాను. అందరితో నిరంతరం మాట్లాడుతున్నాను. భవిష్యత్తుకు అవసరమైన పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాను. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కార్యకర్తలకు పాదాభివందనం

గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారన్న ఆయన... వైకాపా నేతలు ఉన్మాదులు మాదిరిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని...ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.

'రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..? రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాలు న్యాయం చేసుకోవాలి'- చంద్రబాబు తెదేపా అధినేత

వైకాపా పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్​95 మాస్క్​లు అడిగిన వైద్యుడు సుధాకర్...మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఘటనపై ఫేస్​బుక్​లో పోస్ట్ చేసిన రంగనాయకమ్మపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. తితిదే భూముల అమ్మకం, మడ అడవులు, సోషల్ మీడియా పై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

భవితరాల భవిష్యత్​ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో తెదేపా బలోపేతం కోసం నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు

* రైతుల్ని కూడా వదలకుండా ప్రభుత్వం ఇష్టానుసారం కరెంటు ఛార్జీలు పెంచింది.
* తెదేపా హయాంలో పేదల కోసం కట్టిన ఇళ్లను క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడే పరిస్థితి తెచ్చారు.
* అమరావతి నిర్మాణానికి ఉదారంగా భూములిచ్చిన రైతులు.. కరోనా సమయంలోనూ రోడ్లపై ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వారిని చూసి సీఎం రాక్షసానందం పొందుతున్నారు.
* సామాజిక పింఛను మొత్తాన్ని ఈ ప్రభుత్వం రూ.250 పెంచి పనికిమాలిన ప్రచారం చేస్తోంది. తెదేపా అధికారంలోకి వస్తే పింఛను రూ.3 వేలు చేసేవాళ్లం.
* ఈ ప్రభుత్వం 34 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది.
* పెట్టుబడులు పెడతామని వచ్చిన అదానీ, రిలయన్స్‌ వంటి సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి.
* కేరళలో కరోనాను పూర్తిగా కట్టడి చేశారు. తెదేపా అధికారంలో ఉంటే ఇక్కడా కచ్చితంగా కట్టడి చేసేవాళ్లం. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని నేను మొదటి నుంచీ చెబుతుంటే ఎగతాళి చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌ అంటూ సీఎం అవగాహన లేకుండా మాట్లాడారు.
* దోచుకో.. దాచుకో అన్నదే వైకాపా నాయకుల విధానం. అవినీతికి కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
* తితిదే ఆస్తులను అమ్మేయాలనుకున్నారు. 2016లో తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఇప్పుడు రద్దు చేశామని మాట మార్చారు. తప్పు చేయడం, ఎదురుదాడికి దిగడం అలవాటుగా మారింది.
* ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం.. యాజమాన్యానికి వంత పాడుతోంది. ప్రకాశం జిల్లాలో 10 మంది చనిపోతే రూ.10 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో బాధితులకు కంపెనీ పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వమే రూ కోటి చొప్పున ఇచ్చింది. ఇదెక్కడి న్యాయం?

ఇదీ చదవండి:

విశాఖ ఘటన బాధితులకు 'మహానాడు' నివాళులు

Last Updated : May 28, 2020, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.