ETV Bharat / city

తెలుగు ప్రజలకు చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

author img

By

Published : Nov 14, 2020, 10:31 AM IST

తెలుగు రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో హింస, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజుగా అభివర్ణించారు. రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినం అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు.

chandrababu
chandrababu

దీపావళి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కొంటున్నారని... ఇలానే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందన్నారు. కాబట్టి స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి రేపటి పౌరుల గురించి ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరమని అన్నారు. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు.

రాష్ట్రంలో అటు కరోనా కల్లోలం, ఇటు వరుస వరద విపత్తులతో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారు. పాలకులు అవినీతి కుంభకోణాలతో, లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. అప్పులు తెచ్చి, అవినీతి పనులతో సొంత జేబులు నింపుకోవడం కాకుండా సమాజంలో సంపద సృష్టించే ఆలోచనలు పాలకులకు రావాలని ఆకాంక్షిస్తున్నా. పరిశ్రమలు తెచ్చి ప్రజలకు జీవనోపాధి మార్గాలు పెంచే దిశగా వారి మనసులు మారాలని దీపావళి సందర్భంగా కోరుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో ఆశావహ దృక్పథం ఒక్కటే మన జీవితాలలో వెలుగులు నింపుతుంది. చీకట్లను పారద్రోలే వెలుగుపూల దీపావళి తెలుగువారి లోగిళ్ళలో ఆనంద దీపావళి కావాలి.రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.- తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి.. సకల శుభాలు చేకూర్చాలని నారా లోకేశ్‌ ఆకాంక్షించారు. కొవిడ్ దృష్ట్యా ప్రతి లోగిళ్లలో హ‌రిత దీపావ‌ళి జ‌రుపుకోవాలన్నారు. అందరి జీవితాల్లో దీపావళి మరింత వెలుగులు నింపాలని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పర్యావరణ హిత దీపావళి సామగ్రిని వినియోగించాలని సూచించారు.

కూరగాయల నుంచి పెట్రోలు వరకు ధరలన్నీ ఆకాశంలోకి రాకెట్ బాంబుల్లా దూసుకుపోయి.. భయపెడుతున్నాయి. వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి హైడ్రోజెన్ బాంబులు నిత్యం పేలుతున్నాయి. ద్వాపర యుగంలో ఒక్కడే నరకాసురుడు‌... వైకాపా పాలనలో వీధికో నరకాసురుడు జనాలను భయపెడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే దీపావళి ఎలా అని ఆలోచించవద్దు, కష్టాలకు ఆయువు ఎక్కువ. ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడే రోజులు తప్పకుండా వస్తుంది. అందుకు ఈ దీపావళి రోజు ప్రతి ఇంట వెలిగించే దీపమే శుభారంభం పలుకుతుందని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరికీ ‌ దీపావళి శుభాకాంక్షలు.- నారా లోకేశ్

ఇదీ చదవండి: ఏపీ ప్రాజెక్డులపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.