పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేకే వైకాపా నేతలు అప్రజాస్వామిక, విధ్వంస విధానాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెదేపా నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తుండటం అత్యంత హేయమైమ చర్య అని మండిపడ్డారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదంలో సంబంధం లేని చింతమనేనిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించటం మానుకోకుంటే... న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. అధికార వైకాపా.. పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, హింసతో విర్రవీగుతోందని మండిపడ్డారు. తెదేపా నేతలే లక్ష్యంగా హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ చెలరేగిపోతున్న వైకాపాకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు