ETV Bharat / city

వైకాపా.. ఒక్క ఛాన్స్​ను ఆఖరి ఛాన్స్​​ చేసుకుంది: చంద్రబాబు

author img

By

Published : Oct 21, 2020, 7:43 PM IST

Updated : Oct 21, 2020, 10:43 PM IST

వైకాపా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి... అదే ఆఖరి ఛాన్స్​గా మార్చుకుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా తీవ్రంగా ఉన్న జిల్లాల్లో రాష్ట్రం నుంచి 5 జిల్లాలు ఉండటం బాధాకరమన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనా వల్ల రైతులు, పేదలు చితికిపోయారన్న చంద్రబాబు...ప్రభుత్వం వారిని విస్మరించిందని ఆక్షేపించారు.

Chandrababu
Chandrababu

ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులతో తెదేపా అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం పాలనలో కిలో ఉల్లిపాయలు రూ.100 ఎన్నడూ అమ్మలేదని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఇప్పుడంతలా ఎప్పుడూ లేవన్నారు. ఇంధనం, గ్యాస్ రేట్లు పెరిగిపోయాయని, రోడ్లపై ధాన్యం పోసి తగలబెట్టడం వంటి సంఘటనలు ఏనాడైనా జరిగాయా అని ప్రశ్నించారు. విపత్తు బాధితులు మంత్రులను చుట్టుముట్టడం, రోడ్లపై గుంతలను పూడ్చకుండా వదిలేయడం లాంటి ఘటనలు తమ పాలనలో ఎన్నడూ లేవన్నారు. అభివృద్దిని కాలరాసిన ప్రభుత్వం ఎక్కడా చూడలేదన్న చంద్రబాబు.. రాష్ట్రాభివృద్దికి గండికొట్టే పార్టీని ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు.

రివర్స్ పాలనలో అభివృద్ధి రివర్స్

వచ్చే పెట్టుబడులను వెనక్కి తరిమేయడం ఏనాడు జరగలేదన్న ఆయన.. రాజధానిని 3 ముక్కలు చేసి రాష్ట్రానికెంతో నష్టం చేకూర్చారని ధ్వజమెత్తారు. ఎందుకింత విచ్ఛిన్నం చేస్తున్నారని నిలదీశారు. రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్దిని అంతా రివర్స్ చేశారని ఆక్షేపించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాలలో 5 ఏపీలోనే ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం శోచనీయమన్న చంద్రబాబు... 6,500 మంది ప్రాణాలు కోల్పోయరన్నారు. రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్థికంగా చితికిపోయారని గుర్తు చేశారు. ‘బ్లీచింగ్ పౌడర్ జల్లితే చాలు, పారాసిటమాల్​తో కరోనా పోతుందని సీఎం నిర్లక్ష్యం చేయటంతో పాటు తీవ్రతపై తెదేపా చేసిన హెచ్చరికలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పనిచేస్తుంటే అధికారంలో ఉన్న వైకాపా చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా తీసుకున్న బాధ్యతలో, పదోవంతు వైకాపా తీసుకున్నా ఈ దుస్థితి ఉండేది కాదని మండిపడ్డారు.

అధికార దుర్వినియోగం

పెండింగ్ నరేగా బిల్లులు వచ్చేదాకా రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లమన్న చంద్రబాబు..., వైకాపా వచ్చాక జిల్లా అభివృద్ధిపై చేసిన కృషినంతా నీరుగార్చిందని విమర్శించారు. ఏటా రూ.13 వేల కోట్లు నీటిపారుదల రంగానికి ఖర్చు చేస్తే అందులో 3 వంతు కూడా వైకాపా వ్యయం చేయలేదని మండిపడ్డారు. రూ.24 వేల కోట్ల ఆసియా పేపర్ మిల్లును పోగొట్టడంతో పాటు, ఉద్యాన కళాశాల, ట్రిపుల్ ఐటీ అభివృద్ధిని నీరుగార్చారని ఆక్షేపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం చరిత్రలో లేవన్న ఆయన... అరాచకశక్తుల అణచివేతకు తెదేపా అధికారాన్ని వినియోగిస్తే, వైకాపా ప్రతిపక్షాలపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తగా చేసిందేమీ లేదు

రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ...పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పించాలనే ఆలోచనే జగన్​కు లేదని మండిపడ్డారు. పంటల బీమా వాటా చెల్లించకపోవటం, బిందుసేద్యం సబ్సిడీ ఎగ్గొట్టడం, సూక్ష్మ సేద్యాన్ని నాశనం చేసి ఉద్యానవన రైతుల్ని నష్టాల్లో ముంచటం వంటి రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతోందని తప్పుబట్టారు. తెలుగుదేశం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలకు తీరని అన్యాయం చేశారన్న చంద్రబాబు... పథకాలకు పేర్లు మార్చారే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రన్న బీమాకు, వైఎస్సార్ బీమాకు పొంతనే లేదన్న ఆయన... ఆంక్షలు లేకుండా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశామని గుర్తుచేశారు. వైఎస్సార్ బీమాలో సవాలక్ష ఆంక్షలు పెట్టి పేదల ప్రయోజనాలను దెబ్బతీశారని ఆక్షేపించారు. స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలకు దూరం చేసి 800 పోస్టులు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం హేయమని దుయ్యబట్టారు.

సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఇతర నేతలు... కరోనాతో చనిపోయిన తెలుగుదేశం నాయకులు, ఇతర కారణాలతో మృతి చెందిన వారికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి : ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

Last Updated : Oct 21, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.