నేత కార్మికులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు 24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలన్నారు. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్ ఫండ్ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. నేతన్నల దగ్గరున్న సరకును కొనుగోలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: 'పోలీసులు ఏం చేస్తున్నారు... దిశచట్టం అమల్లో ఉందా..?'