దివంగత నేత హరికృష్ణకు చంద్రబాబు నివాళి దివంగత నేత నందమూరి హరికృష్ణ సంవత్సరికం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు.. హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి :
భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత