పోలవరం ప్రాజెక్టు పనులను గత ఏడాదిగా నిలిపివేశారని చంద్రబాబు అన్నారు. కాంట్రాక్ట్ రద్దు చేసి కావాల్సిన వాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. సాగర్‌కు గోదావరి జలాలు ఇచ్చి, శ్రీశైలంలో పొదుపు జలాలు రాయలసీమకు ఇచ్చేలా ప్రణాళిక చేశామని వివరించారు. ఏపీ, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ప్రారంభించింది తెదేపానేనని పేర్కొన్నారు. పంచనదుల అనుసంధానం ద్వారా నీటి కొరత లేకుండా చేయాలని చూశామని వెల్లడించారు.
పోతిరెడ్డిపాడు పనులను ప్రారంభించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. జీవో 203 పేరుతో విద్వేషాలు పెంచుతున్నారని ఆక్షేపించారు. ముచ్చుమర్రి ద్వారా సీమకు నీళ్లిచ్చింది తెదేపానే అని చెప్పారు. దోచుకో-దాచుకో అనేదే వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు.
వైకాపా పాలనలో ఎక్కడ చూసిన బలవంతపు వసూళ్లు, భూకబ్జాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యసేతు యాప్ రూపొందించిన వ్యక్తులను బెదిరిస్తారా..? ప్రభుత్వ ఆస్తులు అమ్మే అధికారం ఎవరిచ్చారు? విశాఖ ఘటనలో బాధితులకు అండగా ఉండకుండా.. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి వంత పాడతారా..? కంపెనీతో డబ్బు ఇప్పించకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తారా..? - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: