వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. 'అమ్మఒడి' పేరిట బెదిరించి తల్లుల నుంచి వెయ్యి రూపాయలు వసూళ్లు చేయడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవ్వకపోతే మొత్తం రూ.15 వేలు ఆపేస్తామని బెదిరిస్తారా..? ఆ అధికారం మీకు ఎక్కడిదని నిలదీశారు. బడుల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమీషన్లు కొట్టేసే 'దొంగమామలను ఇప్పుడే చూస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిడ్డలూ- అమ్మలూ- కాస్త జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి : జగన్ 'వ్యక్తిగత హాజరు మినహాయింపు'పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు