రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేష్‌కుమార్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అరాచకాలపై లేఖలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం పోలీసు అధికారులు పని గట్టుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించే వాతావరణం లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్తలు, నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఈసీ వీటన్నింటినీ సుమోటాగా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని లేఖలో ఆక్షేపించారు. పోటీచేసే అభ్యర్థులకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. సదుం మండలంలో పెద్దిరెడ్డి అనుచరుల వేధింపులు, బెదిరింపులు చేస్తున్నారన్న చంద్రబాబు... అధికారుల వ్యవహారశైలిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండీ... కరోనా: విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా..?