అణగారినవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రన్న బీమాతో 2.50 కోట్ల మంది కార్మికులకు భరోసా, వందల పరిశ్రమలు నెలకొల్పి లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు ఆనాటి కార్మిక సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పుడు లేవని చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా అనాలోచిత విధానాలతో కార్మికులు రోడ్డునపడ్డారని విమర్శించారు. కరోనా సమయంలో కార్మికులకు టీకా, మందులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మే డే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండి: లోకేశ్
నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజే మే డే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మే డే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పాలని పిలుపునిచ్చారు. కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని, పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఆ రోజే శ్రామిక, కార్మిక సోదరులకు నిజమైన మేడే అని అన్నారు. ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి