ETV Bharat / city

'దళితుల ప్రాణాలంటే వైకాపా నాయకులకు చులకనా?' - దళితులపై ఏపీలో దాడులు

తెలుగుదేశం పార్టీ పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారని చంద్రబాబు అన్నారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు అయితే.. రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పని ఆక్షేపించారు. మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా దళిత నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

chandra babu on attack on daliths
చంద్రబాబు
author img

By

Published : Aug 29, 2020, 12:00 PM IST

చిత్తూరు తెదేపా నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ పోలీసులు ఎందుకు తీసుకెళ్లారని చంద్రబాబు నిలదీశారు. ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ కీలకమని, కాల్ లిస్ట్ ను బైట పెడితే బెదిరింపులన్నీ బైటకు వస్తాయన్నారు. బెదిరించి, ప్రలోభాలు పెట్టి జరిగిన నేరాన్ని కప్పి పెట్టలేరని చంద్రబాబు హెచ్చరించారు.

చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు తీశారని, ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని నమ్మించారని.. చంద్రబాబు ఆరోపించారు. ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే ఒళ్లంతా కాలిన గాయాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. గతంలో ట్రిపుల్ మర్డర్ ను మించిన నేరాలు చిత్తూరులో జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణమని చంద్రబాబు విమర్శించారు.

వరుస శిరో ముండనాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 15 నెలలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. దళితుల ప్రాణాలంటే వైకాపా నాయకులకు చులకనగా మారిందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దళితుల హక్కులు కాపాడటంతో పాటు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేశామని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయలన్న చంద్రబాబు.. దళితులపై వైకాపా హింసాకాండను మానవతావాదులంతా గర్హించాలన్నారు. బాధిత దళిత కుటుంబాలకు బాసటగా అందరూ నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. దాడుల కేసులలో దోషులకు శిక్ష పడేదాకా వదిలి పెట్టరాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడమే సరైన నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.