ETV Bharat / city

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ - latest news on coroana

కరోనా ప్రబలుతున్న వేళ గ్రామ వాలంటీర్లతో నిత్యావసరాలను ఇళ్లకు పంపిణీ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్​ను​ కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం సహా అక్రమ మద్యం నివారణ, వివిధ వర్గాలకు ఆర్థికసాయం వంటి అంశాలపై సీఎంకు లేఖ రాశారు.

chandra babu letter to cm jagan on corona
కరోనాపై సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ
author img

By

Published : Mar 31, 2020, 4:33 PM IST

Updated : Mar 31, 2020, 5:14 PM IST

కరోనాపై సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ

కరోనా వ్యాధి తీవ్రత పెరుగుతుంటే ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టడం తగదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. నాలుగున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ నిత్యావసరాలను ఇళ్లకు పంపిణీ చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం సహా అక్రమ మద్యం నివారణ, వివిధ వర్గాలకు ఆర్థికసాయం వంటి అంశాలపై నాలుగు పేజీల లేఖ రాశారు.

లాక్‌డౌన్‌ కారణంగా అనేక రంగాలు ఆర్థికంగా చితికిపోతున్నందున ప్రతి కుటుంబానికి తక్షణమే ఐదు వేల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు... నష్టపోతున్న ఉద్యానపంటలు, ఆక్వా, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో అనధికార మద్యం విక్రయాలు కలవరపెడుతున్నాయని.. వాటిని తక్షణమే నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా నిర్వహిస్తోందన్న చంద్రబాబు....కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈనెల 17వ తేదీన నిజాముద్దీన్ నుంచి దాదాపు 700మంది రాష్ట్రానికి వచ్చినందున...వారందరికీ తక్షణమే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : Mar 31, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.