పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైకాపా పతనం ప్రారంభమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అవినీతిపై శక్తివంచన లేకుండా పోరాడామని చెప్పారు. ప్రజలు తెదేపా పోరాటానికి అండగా నిలిచారాని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఫలితాలు తారుమారవటం ప్రజాస్వామ్య అపజయమే అని దుయ్యబట్టారు.
మరో పులివెందులగా మారుస్తారా..?
కుప్పంలో వైకాపా గెలవలేదు. ప్రజాస్వామ్యం ఓడింది. కోట్ల రూపాయలు డబ్బులు పంచారు. కుప్పంతో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. అక్కడ ప్రజలు నన్ను కుటుంబసభ్యుడిగా భావిస్తారు. శాంతికి మారుపేరు కుప్పం. అలాంటి ప్రాంతాన్ని కలుషితం చేస్తారా? కుప్పాన్ని మరో పులివెందులగా మారుస్తారా? అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు?- చంద్రబాబు, తెదేపా అధినేత
ఆధారాలిచ్చినా.. పట్టించుకోలేదు..
కోట్లాది రూపాయల డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై అన్ని ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి చర్యలు తీసుకోవడం చేతకాకపోతే... రాష్ట్రాన్ని ఉన్మాదులకు వదిలిపెడతారా అని ప్రశ్నించారు.
విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం..
ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు తెదేపా మద్దతుదారులే గెలిచారని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడారని తెలిపారు. వైకాపాకు ఓటేయనివారిపై దాడులు చేస్తున్నారని.. విచ్ఛలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు.
పోలీసులకు పనేంటి..?
పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఫలితాలు తారుమారు చేశారని చంద్రబాబు అన్నారు. పోలీసులే బెదిరింపులకు దిగారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో పోలీసులకు పనేంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాత్రి 10 గంటల తర్వాత గెలుపు మార్చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితులు తెచ్చారని అన్నారు. సీఎం ఉన్మాదంతో స్థానాలపై లక్ష్యాలు నిర్ధేశించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆక్షేపించారు.
రాష్ట్రాన్నీ అమ్మేస్తారు..
'విశాఖ ఆత్మను అమ్మేస్తున్నారు.. రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు. స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతుందా? దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేది సీఎం తాపత్రయం. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు అన్నీ పోయాయి.- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: