ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్.. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎంగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి పత్రికా కథనాలే నిదర్శనమంటూ జగన్‌కు వ్యతిరేకంగా జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: