ETV Bharat / city

'పెత్తందారీ రాజ్యాన్ని తేవాలనే బీసీల రిజర్వేషన్లలో కోత' - స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్

33 ఏళ్లుగా బీసీలు పొందుతున్న పదవులకు కోత పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. పెత్తందారీ రాజ్యాన్ని మళ్లీ తెచ్చే లక్ష్యంతోనే రిజర్వేషన్లను వైకాపా తగ్గించిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణమని ఆక్షేపించారు.

chandra babu
చంద్రబాబు
author img

By

Published : Mar 9, 2020, 3:09 PM IST

పెత్తందారీ రాజ్యాన్ని మళ్లీ తెచ్చే లక్ష్యంతోనే వైకాపా బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కొన్ని జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణమని ట్విటర్​ వేదికగా ఆక్షేపించారు. తెదేపా ఆవిర్భావం తర్వాతే సామాజిక న్యాయం వెల్లివిరిసిందన్న చంద్రబాబు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దసంఖ్యలో పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. 33 ఏళ్లుగా బీసీలు పొందుతున్న పదవులకు కోత పెట్టారని, చట్టసభలు, ప్రభుత్వ విధానాల్లో బీసీల భాగస్వామ్యాన్ని దూరం చేసే కుట్ర ఇదని మండిపడ్డారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతానికి పైగా స్థానాలను బీసీలకు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయ పరిరక్షణకు బీసీలంతా ఏకంకావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:స్థానిక పోరులో 34 శాతం స్థానాలు బీసీలకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.