రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో అన్న అయోమయ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అనేక అవతకవకలు జరుగుతున్నాయని విమర్శించారు. రెండవ రోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
తెదేపా పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటలబీమా ఇచ్చామని.. తుపాన్ల సమయంలో పాడైన ధాన్యం కొనుగోలు చేశామని చంద్రబాబు అన్నారు. రైతుల జీవితాలు బాగు చేసేందుకు అనేక ఏర్పాట్లు చేశామన్నారు. రాయలసీమలో 8 లక్షల వ్యవసాయ కుంటలు తవ్వామన్నారు. రాయలసీమకు సాగునీరు ఇవ్వాలనేది తొలుత ఎన్టీఆర్ ఆలోచన అని గుర్తు చేశారు. తెదేపా హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చి చీనీ చెట్లను కాపాడామని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి:
Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి: నందమూరి బాలకృష్ణ