ETV Bharat / city

chandra babu:'కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం' - chandra babu comments on nregs bills

గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై వైకాపా ప్రభుత్వం కక్షసాధిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని అన్నారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Oct 12, 2021, 12:35 PM IST

గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కోర్టులు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులేమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్​కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్​కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని. వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం హేయనీయమని విమర్శించారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు 80 వేల కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని దుయ్యబట్టారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. వారికి ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.1,438.08 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.