ETV Bharat / city

chandra babu comments on cm jagan: 'ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోంది' - free houses

chandra babu comments on cm jagan: పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారుల మెడకు ఓటీఎస్​ ఉరితాడుగా మారుతోందని తెలుగుదేశం నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్​ కట్టించిన ఇళ్లకు.. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న సీఎం భూమి, రుణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా? అని నిలదీశారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్​ కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆక్షేపించారు.

chandra babu comments on cm jagan
chandra babu comments on cm jagan
author img

By

Published : Dec 6, 2021, 2:09 PM IST

Updated : Dec 6, 2021, 6:10 PM IST

chandra babu comments on cm jagan: ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు పెడతారా? అని నిలదీశారు. ఛీటింగ్ కేసులు.. 420 కేసులు ఈ ప్రభుత్వంపై పెట్టాలని దుయ్యబట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. బలవంతంగా వసూలు చేస్తూ... స్వచ్ఛందమంటారా? అని చంద్రబాబు నిలదీశారు.

చంద్రబాబు

ఇప్పుడున్న సీఎం భూమి, రుణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా..? ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకు ఇప్పుడు వసూలు చేస్తారా? ఇంటి రుణం మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు. ఇచ్చిన మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పటికే జగన్ బయట తిరగలేకపోతున్నారు. వైద్యానికి దాచుకున్న సొమ్ము ఓటీఎస్ కోసం వసూలు చేస్తారా? - చంద్రబాబు

చంద్రబాబు

గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా చట్టవిరుద్ధమే అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లే చేయాలని స్పష్టం చేశారు. ఎవరుపడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ఇష్టానుసారం చేస్తూ డాక్యుమెంట్లను వైకాపా రంగుల్లో ఇస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ద్రోహిగా వైకాపా మిగులుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.

'మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్‌కు అలవాటైంది. కేసులు మాపై కాదు... మీపై ఛీటింగ్‌ కేసు పెట్టాలి.తప్పుడు కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారా?. డబ్బులు కట్టకపోతే పథకాలు రద్దవుతాయని బెదిరిస్తారా?. ఆడబిడ్డలకు ఒక్క రూపాయి తీసుకోకుండా మేం రిజిస్ట్రేషన్‌ చేయించాం.తప్పులను ప్రశ్నించే హక్కు మాకు లేదా? చట్ట ఉల్లంఘన చేసే వ్యక్తులకు శిక్ష తప్పదు. తప్పుడు కేసులకు భయపడి పోరాటాలు ఆపేది లేదు.' - చంద్రబాబు

దేశానికి అంబేడ్కర్ ఎనలేని సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తితో తెలుగుదేశం పనిచేస్తోందన్నారు. దూరదృష్టి ఉన్న భారత దేశ శిల్పి అంబేడ్కర్ అని కొనియాడారు. అమరావతి ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం పెట్టాలని నిర్ణయించామని.. విగ్రహ నిర్మాణానికి 20 ఎకరాల భూమి కూడా ఎంపిక చేశామని చంద్రబాబు గుర్తి చేశారు. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దేశానికే ఆదర్శమైన నిర్ణయాన్ని పట్టించుకోలేదని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 6, 2021, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.