ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా నేతలు బస్సుయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. 13 జిల్లాలు, వందకు పైగా నియోజకవర్గాలు చుట్టేలా.. 45 రోజుల ప్రణాళికను చంద్రబాబు సమావేశంలో ప్రతిపాదించారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యాత్ర చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ తప్పిదాలపై జనచైతన్య యాత్ర చేద్దామని చంద్రబాబు చెప్పిన మేరకు... ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల నేతృత్వంలో 45 రోజుల పాటు.. 175 నియోజకవర్గాలు చుట్టేలా యాత్రకు నిర్ణయించినట్టు సమాచారం.
ఇదీ చదవండి: