ETV Bharat / city

అవినీతి ఆరోపణలతో సీజీఎస్టీ సహాయ కమిషనర్​ సస్పెన్షన్ - హైదరాబాద్​ సీజీఎస్టీ కమిషనర్​ సస్పెండ్​

అవినీతి ఆరోపణతో సీజీఎస్టీ సహాయ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీని కేంద్ర ఆర్థికశాఖ సస్పెండ్ చేసింది. ఈనెల 17నే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా హైదరాబాద్​ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది.

cgst-assistant-commissioner-in-hyderabad
అవినీతి ఆరోపణలతో సీజీఎస్టీ సహాయ కమిషనర్​ సస్పెన్షన్
author img

By

Published : Feb 24, 2021, 10:31 PM IST

హైదరాబాద్​లో సీజీఎస్టీ సహాయ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీని కేంద్ర ఆర్థికశాఖ సస్పెండ్ చేసింది. దీర్ఘకాలం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​లో పనిచేసిన శ్రీనివాస్​.. వస్తుసేవల పన్ను ఎగవేత విభాగంలోనూ సూపరింటెండెంట్​గా విధులు నిర్వర్తించారు. ఈడీ, జీఎస్టీలో పనిచేస్తున్న సమయంలో పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు.

పన్ను ఎగవేత విభాగంలో పనిచేసిన సమయంలో బోగస్ సంస్థల పేరున నకిలీ ఇన్​వాయిస్​లు సృష్టించి ఇన్​పుట్‌ టాక్స్​క్రెడిట్ పొందిన అభియోగంపై ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్​ సంస్థ ఎండీ శ్రీధర్​రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 5 కోట్లు డిమాండ్ చేసి రూ.10 లక్షలు లంచం తీసుకున్నట్లు 2019 సెప్టెంబరుతో బొల్లినేని శ్రీనివాస్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతకు ముందు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపైనా కేసు నమోదయింది. ఈ కేసులు విచారణ జరుగుతుండగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్​ను కేంద్ర ఆర్థిక శాఖ ఈనెల 17న సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకిరాగా.. అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లరాదని అందులో స్పష్టం చేసింది.

cgst-assistant-commissioner-in-hyderabad
అవినీతి ఆరోపణలతో సీజీఎస్టీ సహాయ కమిషనర్​ సస్పెన్షన్

ఇవీచూడండి: బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అవినీతిలో కొత్త కోణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.