పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై వివరాలు అందాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కమిషనర్ అనుపమ్ కుమార్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.
స్పిల్ వే, టన్నెల్స్, కాపర్ డ్యామ్, రెగ్యులేటర్ సిస్టం, పట్టిసీమ డెలివరీ, లిఫ్టింగ్ పాయింట్స్ తదితర ప్రాంతాల్లో సాంకేతిక బృందంతో కలిసి పర్యటించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలు తెలుసుకుంటూ, పనుల పురోగతిపై సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయంబర్స్మెంట్ నిధులు, తాగునీటికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్టు వెల్లడించారు.
ఇదీచదవండి.